హోరా నిర్ణయ సంగ్రహం
ఉత్తర కాలామృతం లో కాళిదాసు లగ్నము నుంచి మొదటి నాలుగు బావాలు వర్తమానమని, తరువాత వచ్చే నాలుగు బావాలు భవిష్యత్తు అని చివరి నాలుగు బావాలు భూత కాలమును సూచిస్తాయి అని కాల చక్రములోని ద్వాదశ బావాల గురించి వివరించియున్నారు. దీనినే నాడీ శాస్త్రములో 1,5,9 బావాలను లగ్న త్రికోణమనే కాన్సెప్ట్ తో తీసుకు రావడమైనది. ఇలా ప్రతి బావాన్ని త్రికోణముతో సంబంద పరిస్తే లగ్న త్రికోణము లేదా ధర్మ త్రికోణము అని 1, 5, 9 స్థానాలను, అర్ధ త్రికోణమని 2,6,10 స్థానాలను, 3, 7, 11 కామ త్రికోణాలని, 4, 8, 12 స్థానాలను మోక్ష త్రికోణమని పిలుస్తారు. అలాగే 6, 8, 12 స్థానాలని త్రిక స్థానాలని, 4, 7, 10 స్థానాలను కేంద్రాలని పరాశర మహర్షి తెలియచేయడం అందరికీ తెలుసు.
విశ్లేషణ కోసమని కావ్యకంఠ మహా ముని మరికొద్దిగా ముందుకు వెళ్ళి వీటిలో కొన్ని మార్పులు సూచించడం జరిగింది. అదే "హోరా నిర్ణయ సంగ్రహం" అనే పుస్తకం ద్వారా తెలియచేయడం జరిగింది. విష్ణు స్థానాలు అని పిలిచే ధర్మ త్రికోణమునకు అంటే లగ్న త్రికోణమైన 1, 5, 9 స్థానాలకు వాటి సప్తమ స్థానం అడ్డంకులు సృష్టించడం కానీ, లేదా జాతకుడి గమ్యాన్ని మార్చే శక్తిని గాని కలిగి ఉంటుందని అంటే ఒక విధంగా అది అనుకూలమైన శత్రు స్థానముగా వ్యవహరిస్తుందని వాటిని ప్రతీపము అన్న పేరుతో సూచించడం జరిగింది. అంటే 1, 5, 9 స్థానాలకు 3, 7, 11 స్థానాలు అంటే కామ త్రికోణాలు ప్రతీపముగా చెప్పడం జరిగింది.
ద్వాదశ స్థానాలలో ప్రతి తార గ్రహాలకు రెండేసి సంజ్ణల ఆధిపత్యము ఉండటం వలన ఈ ప్రతీప సూచన విశ్లేషణ చేసే వారికి సులభ మార్గాన్ని చూపి నట్లైనది. రవి, చంద్రులు బింబ గ్రహాలు కాబట్టి ఒక స్థానానికే ఆధిపత్యము కలిగి ఉండటం మనకు తెలుసు. ప్రతీప స్థానానికి అధిపతి అయిన గ్రహం పరాశరుడు సూచించిన త్రిక స్థానానికి కూడా అధిపతి అయితే ఆ గ్రహము పాప గ్రహమని జాతకుడికి అనుకూలము కాదని సూచించారు ఈ పుస్తకములో... ఇలా ఒక గ్రహము శుభత్వము లేదా పాపత్వము ఎంత వరకు అందిస్తుందో తెలియ చేసే ఈ విధానము అత్యంత ఆవశ్యకము ప్రతి జ్యోతిష జ్ణానికి.... ఈ విధానము ప్రతి లగ్నానికి ఎలా ఉంటుందో క్రింద చూడగలరు.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.