పుట్టిన సమయ నిర్ధారణ
జాతక పరిశీలనలో పుట్టిన సమయ ఖచ్చితత్వాన్ని నిర్ధారించాలసిన అవసరం ఎంతైనా ఉంది. కారణం ఏ రెండు గడియారాలు ఒకే సమయాన్ని సూచించవు. అంతే కాక శిశువు డెలివరీ సమయములో దృష్టి గడియారం పై ఉండదు. కాబట్టి ఆలస్యము అన్నది సర్వత్రా సాధారణం. శిశువు భూపతన, రోదన, తల బయల్పడు సమయమనే సంక్లిష్టత ఉందనే ఉంది. అందుకనే ఈ సమయ నిర్ధారణ కోసమే జ్యోతిష పరంగా అనేక పద్దతులు కలవు. అందులో KP పద్దతి వచ్చిన తరువాత ఆ అవసరం మరింత ఎక్కువైనది. ఈ KP పద్దతి కూడా కుల్లర్ మరింత అభివృద్ది చేయడముతో ఈ BTR అన్నది కొత్త మార్పులతో సూచించడం జరిగింది.
ఇదివరకే 2 రకాలుగా పుట్టిన సమయాన్ని నిర్ధారిస్తున్నారు.
1. రూలింగ్ గ్రహాల పద్దతి
2. జీవితములో జరిగిన సంఘటనల ఆధారం.
ఇప్పుడు కొత్తగా వచ్చిన మూడో పద్దతి సబ్-సబ్ కక్ష్యా అధిపతుల జెనెటికల్ సూచన.
ఇదివరకు 1, 2 పద్దతుల ని ఉపయోగించి సమయాన్ని నిర్ధారించేవారు. ఇప్పుడు మూడో పద్దతి కేపి పై ఆధారముతో వచ్చిన కుల్లర్ CIL పద్దతిని ఉపయోగించి నూతన విధానం. ఇది జెనీటికల్ గా ఆధారం చేసుకొని ధృవీకరిస్తారు.
అందుకు ఉపయోగించే తార బలం సూచించే నక్షత్రాల వివరాలు ఒక్కో సబ్ ఆధారంగా ఇవ్వడమైనది. అంటే ప్రతి నక్షత్రానికి 9 సబ్ లు. ఒక్కో సబ్ కు 9 సబ్-సబ్ కక్ష్యలు.
ఒక్కో నక్షత్రానికి సుమారుగా 26 నక్షత్రాలు 81 సార్లు సూచనగా రావడం జరుగుతుంది. ఈ కారణముగా BTR అనేది తేలికగా చూడవచ్చు.
ప్రత్యేకముగా వీటి కోసం కొన్ని వీడియోలు సబ్-సబ్ కక్ష్యాధిపతులు సూచించే నక్షత్రాలు కోసం తయారుచేయడం జరిగింది. ఒక్కో నక్షత్రానికి ఒక్కో వీడియో చొ.. న మొత్తం 2193 కక్ష్యాధిపతులు వారు సూచించే నక్షత్రాలు చూడవచ్చు. ఇవి వరుసగా youtube చానెల్ లో వరుసగా వస్తుంది. వేచి చూడగలరు.
అశ్విని - భరణి - కృత్తిక - రోహిణి - మృగశిర - ఆర్ద్ర - పునర్వసు -
పుష్యమి - ఆశ్లేష - మఖ - పుబ్బ - ఉత్తర - హస్త - చిత్త -
స్వాతి - విశాఖ - అనురాధ - జ్యేష్ట - మూల - పూర్వాషాడ - ఉత్తరాషాడ
శ్రవణ - ధనిష్ట - శతభిష - పూర్వాభాద్ర - ఉత్తరాభాద్ర - రేవతి
ఉదా ::1. లగ్న సబ్-సబ్ అధిపతి నక్షత్రాలలో జాతకుడి జన్మ నక్షత్రం ఉండాలి. లేదా ఆ కక్ష్యాధిపతి జన్మ నక్షత్ర అధిపతి నక్షత్రాలలో ఉంటూ జన్మ నక్షత్రానికి సంబందం ఏర్పరచుకోవాలి.
2. నాలుగో కస్ప్ సబ్-సబ్ అధిపతి తల్లి యొక్క జన్మ నక్షత్రానికి పై విధంగానే సంబందపడాలి.
3. తొమ్మిదో కస్ప్ అధిపతి తండ్రి జన్మ నక్షత్రముతో పై విధంగానే సంబందం ఏర్పరుచుకోవాలి.
4. అలాగే కళత్ర స్థాన కస్ప్ కూడా బార్య జన్మ నక్షత్రముతో సంబంద పడాలి.
ఈ విధంగా తోడబుట్టినవారిది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పుట్టిన బిడ్డల విషయములో మాత్రం కొని జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం కార్మిక్ సంబందం అంటే పుట్టే వారి సంబందం మన జాతకములో ఒక్కోసారి రావచ్చు /రాకపోవచ్చు. కారణం ప్రోజీని ఎఫెక్ట్ అన్నది కనపడుతుంది. అంటే పుత్ర స్థానం అష్టమముతో సంబంద పడితే పుట్టే బిడ్డలు జాతకుడికి సంబంద పడటం అన్నది పెద్ద ప్రహేలిక. కాబట్టి సంతానం తో కాకుండా సమకాలికులు అయిన బంధు వర్గంతో సారి చూసుకోండి.
జీవి చేసే సంచిత కర్మల ఫలితమే వచ్చే తరానికి కర్మ సంబందం ఏర్పరుస్తుంది. ఈ సంచిత కర్మల విషయం ప్రస్తుతం అనుభవిస్తున్న కారణ శరీర ప్రారబ్దము కాబట్టి రాబోయే తరాలలో తిరిగి జన్మ నెత్తే అవకాశం ఒక జీవికి రావాలంటే అంటే ప్రస్తుత శరీర జీవి, కారణ శరీరముగా రావాలంటే రెండు తరాలు మారాలి అంటే ఒక జాతకుడిని తీసుకుంటే వారి సంతానానికి పుట్టే బిడ్డలలో ప్రస్తుత శరీరము కారణ శరీరముగా వచ్చే అవకాశం. కాబట్టి జెనీటికల్ పద్దతిలో పుత్ర సంతానము యొక్క జన్మ నక్షత్రం రావడం అన్నది కష్టమని నా భావన. ప్రస్తుత కర్మల ఫలిత మొత్తాన్ని జీవి చూస్తున్నది రెండు తరాల క్రింద జీవించిన జన్మలది కాబట్టి మనది మనం చూడాలి అంటే మనవళ్ల/మనవరాళ్ళ జాతకాలు చూడాలి. ఈ విధంగా ఆలోచిస్తే జెనీటికల్ పొంతన BTR విషయములో అర్ధం అవుతుంది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.