KOTA CHAKRA - కోట చక్రం
గోచారములో గ్రహములు 28 నక్షత్రాలపై ఎలా ప్రయాణిస్తుందో వివరించి చెప్పేది ఈ చక్రము యొక్క ఆంతర్యం.
ఒక జీవి జాతకములో ఉన్న గ్రహములలో ఆ జీవికి మేలు చేసేవి, కీడు చేసేవి ఉంటాయి. ఆ గ్రహములకు జాతకముతో సంబందం లేకుండా వాటి కేరక్టర్ ద్వారా శుభ/అశుభ గ్రహములుగా మహర్షులు చెప్పటం జరిగింది. ఉన్న ద్వాదశ రాశులను బట్టి ఈ గ్రహములు యోగా కారకములుగా లేదా శుభ/ అశుభ గ్రహములుగా కూడా విడి విడిగా చెప్పటం జరిగింది. కాల చక్రమును రెండు భాగములుగా చేస్తే మొదటిది క్షేత్రజ్ణుడు ఉన్న భాగానికి రెండవది శత్రు భాగమవుతుంది. అంటే లగ్నము 'ధర్మ' సంజ్ణ అయితే సప్తమము అన్నది విధిగా పురుషార్ధములలో మూడవది అయిన 'కామ' సంజ్ణ అవుతుంది. అంటే జీవి తన గత జన్మ కోరికల ఆకారముతో ఈ జన్మను సాధించడమే అక్కడి ఆంతర్యం.
గ్రహ చారము కొద్ది చెడు చేసే గ్రహములు కోట అంతర్భాగాన్ని చేరి ధ్వంసం చేస్తే ఆ జీవి మనుగడ అంతమవుతుంది అన్న దానికి సూచనగా ఈ కోట చక్రాన్ని విశ్లేషణ చేస్తారు. ఈ కోటకు కోట స్వామి, కోట పాలకుడు అన్న పేరుతో రెండు భిన్న గ్రహములు (తొమ్మిదింట్లో) పాలకులుగా ఉంటారు. కోట స్వామి నిర్ణయం చంద్రుడు ఉన్న నక్షత్ర రాశి అధిపతి తీసుకుంటాడు. కోట పాలకుడు చంద్రుడు ఉన్న నక్షత్ర పాద అధిపతి నిర్ధేశిస్తాడు. కోట స్వామి ఎవరూ అన్నది తెలుసుకోవడం తేలిక. కోట పాలకుడికి మాత్రం క్రింది పట్టిక చూసి నిర్ణయించాలి.
పాదం 1 పాదం 2 పాదం 3 పాదం 4
01. అశ్విని : శుక్ర శుక్ర శుక్ర చంద్ర
02. భరణి : చంద్ర చంద్ర చంద్ర చంద్ర
03. కృత్తిక : రవి రవి రవి రవి
04. రోహిణి : రవి చంద్ర చంద్ర చంద్ర
05. మృగశిర : చంద్ర చంద్ర కుజ కుజ
06: ఆర్ద్ర : కుజ కుజ కుజ శుక్ర
07. పునర్వసు : కుజ కుజ రాహు రాహు
08. పుష్యమి : రాహు రాహు రాహు బుధుడు
09. ఆశ్లేష : బుధుడు బుధుడు బుధుడు బుధుడు
10. మఖ : శని శని శని శని
11. పుబ్బ : శని బుధుడు బుధుడు బుధుడు
12. ఉత్తర : బుధుడు బుధుడు శని శని
13. హస్త : శని రాహు బుధుడు బుధుడు
14. చిత్త : శని శని చంద్ర చంద్ర
15. స్వాతి : చంద్ర చంద్ర చంద్ర గురువు
16. విశాఖ : గురువు గురువు గురువు గురువు
17. అనురాధ : గురువు గురువు గురువు గురువు
18. జ్యేష్ట : గురువు చంద్ర చంద్ర చంద్ర
19. మూల : చంద్ర చంద్ర శని శని
20. పూర్వాషాడ : శని గురువు శని బుధుడు
21. ఉత్తరాషాడ : శని శని శుక్ర శుక్ర
22. శ్రవణ : కుజ కుజ కుజ కుజ
23. ధనిష్ట : కుజ కుజ కుజ కుజ
24. శతభిష : కుజ రాహు రాహు రాహు
25. పూర్వాభాద్ర : రాహు రాహు గురువు గురువు
26. ఉత్తరాభాద్ర : గురువు గురువు శుక్ర శుక్ర
27. రేవతి : గురువు గురువు శుక్ర శుక్ర
నిర్మాణం

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.