నాభాస యోగము:
1 సంఖ్యా యోగము: ఈ యోగము చూడాలి అనుకుంటే జాతక చక్రములో నవ గ్రహాల బదులు సప్త గ్రహములు మాత్రమే గమనించాలి. అంటే ఛాయ గ్రహములు అయిన రాహు, కేతువులను లెక్కలోకి తీసుకోకూడదు. పుట్టిన జాతకుడి కుండలిలో ఈ సప్త గ్రహాలు 12 రాశులలో ఎక్కడైనా ఉండవచ్చు. కానీ సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర మరియు శనీశ్వర గ్రహాలు మాత్రం ఎన్ని రాశులలో ఉన్నాయో లెక్క కట్టాలి. ఉదాహరణకు ఒకరికి ఏడు గ్రహాలు ఒకే రాశిలో ఉండవచ్చు లేదా ఏడు రాశులలో ఉండవచ్చు. కాబట్టి ఎన్ని రాశులలో ఈ సప్త గ్రహాలు ఉన్నాయో దానిని బట్టి ఫలితం సూచన ప్రాయంగా తెలుస్తుంది. ఈ యోగలను క్రింది విధంగా తెలుసుకుంటాము.
a). గోలా యోగ: ఏడు గ్రహములు ఒకే రాశిలో ఉంటే ఆ యోగాన్ని గోలా యోగం అని పిలుస్తారు. పేరును బట్టే ఫలితం తెలిసిపోతుంది. అన్ని గ్రహాలు ఒకే చోట ఉంటే అవి పరస్పర ప్రభావితం చేస్తాయి. అవి ఒకరి కొకరికి శతృత్వం వల్ల చాలా ఘర్షణలు సంభవిస్తాయి. గ్రహాలు (శక్తులు) ఒకరితో ఒకరు పోరాటం చేస్తే, అది జాతకుడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏ గ్రహం సానుకూల ఫలితాలను ఇవ్వదు. గ్రహాల మధ్య గ్రహయుద్ధం లేదా గ్రహాల సూర్యుడి సమీపంలో ఉండడం వల్ల శక్తి తక్కువ కావడం (కంబషన్) జరిగే అవకాశం ఉంటుంది. ఫలితాల ప్రకారం తీసుకుంటే ఆవిద్య(చదువు లేకపోవడం) లేదా ఆయువు తగ్గడం, మోసకారి తనమునకు అలవాటు పడటం, శరీర ఆకారములో అవయవ లోపం, సమాజానికి ఉపయోగ పడలేకపోవటం లాంటివి ఎన్నో బలహీనతలు ఉంటాయి. జాతకుడి జీవన శైలి గోల గోల గా ఉంటుందన్న మాట.
b). యుగ యోగ: సప్త గ్రహాలు రెండు రాశులలో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. సూర్యుడి సమీపములో ఉన్న గ్రహముల మధ్య శక్తి తక్కువ అవుతుంది. రెండవ రాశిలోని గ్రహముల మధ్య అనుకూలత ఉంటే గుడ్డి లో మెల్ల లాగా ఈ యోగం పనిచేస్తుంది. లేదంటే గోల యోగం లాగే ఈ యోగం కూడా యుగానికి ఒక్కడు(నెగటివ్ కోణం) అన్న చందానా జాతకుడు సమాజానికి దూరంగా ఉండటం జరుగుతుంది. అవమాన పడుతూ సపోర్టు(తల్లి, తండ్రి కూడా లేక) చేసే వారు లేక జీవితం వెళ్లదీస్తారు.
c) శూల యోగ: ఏడు గ్రహములు మూడు రాశులలో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగానికి ఆయుధం పేరు రావడం వల్ల కోపము, ఘర్షణ అనేవి ముఖ్యమైన కారకము అవుతుంది. కోపము వల్ల జీవనోపాధి లేకపోవడం, పేదరికం, అసహాయత పెరిగి సమాజం పై తిరగబడటం అన్నది అతిముఖ్యమైన ఫలితాలు. గొడవల కారణముగా జీవితములో హెచ్చు తగ్గులు ఉండి ఒక రౌడీ షీటర్ లా జీవితాన్ని వెళ్లదీస్తారు.
d) కేదార యోగ: సప్త గ్రహాలు నాలుగు రాశులలో ఉండటం వలన ఈ యోగం పవిత్రత ను సూచన ప్రాయంగా తెలియచేస్తుంది. దీనినే కేంద్రాల యోగం అని, చారధామ్ యాత్రలో కేదార్నాధ్కు ఉన్న ప్రత్యేకత కారణముగా ఈ యోగం పేరు కూడా కేదార యోగం అని రావడం కూడా శోభత ఇస్తోంది. ఈ యోగం వల్ల జాతకుడు సత్య శీలుడు, ఆస్తిని నిలబెట్టుకునే శక్తి, దాన గుణం వంటి ఫలితాలు ఏర్పడుతుంది.
e)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.