1. జాతక చక్రములో చంద్రుడు లగ్నము(asc) నుండి ఉన్న స్థానము ననుసరించి వింశోత్తరీ దశ నిర్ణయమును గుర్తించాలి. ఉదాహణకు లగ్నము, చంద్రుడు ఒకే రాశిలో ఉంటే చంద్రుడు ఉన్న నక్షత్రమును బట్టి వింశోత్తరీ దశ లెక్క గట్టాలి. ఈ నియమం చంద్రుడు లగ్నము నుండి 4, 5, 7, 9, 10 రాశులలో (లగ్నము నుండి) ఉన్నప్పుడూ కూడా వర్తిస్తుంది.
అలా కాక 2, 6 రాశులలో ఉంటే చంద్రుడు ఉన్న నక్షత్రము కాక నాలుగవ నక్షత్రం అంటే క్షేమ తార నుండి ఈ వింశోత్తరీ దశ గణన చేయ్యాలి.
అదే 3, 11 రాశులలో చంద్రుడు ఉంటే చంద్రుడు ఉన్న నక్షత్రము నుండి ఐదవ నక్షత్రము అంటే ప్రత్యక్ తార ను తీసుకోవాలి.
అలాగే 8, 12 రాశులలో చంద్రుడు ఉంటే తారబలం లెక్కలో ఎనిమిదవ తార అంటే మిత్ర తార నుండి వింశోత్తరీ దశ గణన మొదలు పెట్టాలి.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.