Thursday, 22 July 2021

Nakshatras - Shakti - Mythological Characters

LAGNA NAKSHATRAS - MYTHOLOGICAL CHARACTERS

Aswini :: Nakula & Sahadev, Aswaddhama

Bharani :: Rahu,  

Krittika :: Lord Subramanyam, 

Rohini :: Sri Krishna, Bheema, 

Mrigasira :: Moon, Drona, 

Ardra ::

Punarvasu :: Sri Ram, 

Pushyami :: Brihaspati, 

Aslesha :: Ketu, Lakshmana, Yudhistira

Makha :: Venus, 

Purva Phalguni ::

Uttara Phalguni :: Arjuna, 

Hasta :: Sun,      

Chitta ::

Swati ::

Visakha :: Kartikeya,  

Anuradha ::

Jyeshta :: Indra, 

Moola :: Hanuman, 

Purva Shada ::  Bheeshma, Indrajit, Varuna, 

Uttara Shada :: Mars,

Sravana ::

Dhanishta :: Mercury

Satabhisha ::

Purva Bhadrapada :: Karna, Kubera, 

Uttara Bhadra :: Lord Vishnu, 

Revati :: Saturn, Ravana, Abhimanyu, 

Any viewer knows some other mythological character lagna nakshatra may kindly share the info .. for the world of Astrology enthusiasts. 


Monday, 19 July 2021

Mundane Astrology Info..

 MUNDANE ASTROLOGY - MEDHINI JYOTISHAM

SIGNIFICATIONS OF PLANETS

SUN :: Presidents/Prime Ministers, Queens, Kings, Sultans, power in the people (One who rules parts of Land/Earth), Elections, Coronation, Group of people represented (any cause) by one single person, Famous/Familiar personalities in different dimentions/fields, All Day activities. 

MOON :: Married Females by nature, Catetering and Food, Watery liquids, Floods and Drought by phase activity, Instinctive activities,

MARS :: Wars, Disputes, Frustrating Activities, National Army/ Domestic Police personal, Angry people, Alcohol consuming persons, Play Ground Activities, Gym. users.

MERCURY :: Mass Media,Ambassadors, Educational Institutes, Bussiness(Trade) centers, Industries, Mathematical People, Sports Players,   

JUPITER :: Libraries, Ashrams, Spiritual/religious Centres, Courts, Divine/religious Gurus, Children in general,   

VENUS :: Young Girls, 64 Arts academic people, Luxury, Show expressive Beauty activities, Marriage and Marriage Halls, Sexual actions, Births/Re-births.   

SATURN :: Servants, Old & Handicapped People, Agriculture, Mines, All Night activities.  

RAHU :: Mafia, Theives, Archeology, History, Diseases beyond Cure or curing by one doctor, Selfishness to hold all, hacking cheators.

KETU :: Unresponsible duty minded personalities, Unable /un-interested to continue the life, Sanyasis, Aghoras, Inflations, Epidemic diseases, un-attached. 

 

సందేహాలు ఉన్నవారు నా వాట్సాప్ కి మెసేజ్ చేయగలరు. ఈ సౌకర్యం నా బ్లాగ్ aobastrology ఫాలో అవుతున్నవారికి మాత్రమే... 

Sunday, 18 July 2021

Nadi Amsa - Traditional & Scientific Calculation

 గ్రహణాం అంశకం బలం  

కుండలి రీత్యా గ్రహం యొక్క బలం తెలియాలి అంటే గ్రహం ఉన్న అంశ విలువ, శుభ/అశుభ తత్వం సూచించే అంశ అధిపతి, గుణం తెలుసుకోవాలి. ఈ క్రింద ఇచ్చిన పట్టిక ద్వారా పరాశర మహర్షి సూచించిన షోడశ వర్గ వివరాలు తెలుస్తాయి. వీటి ఒక్కో విలువలను వరుసగా ఒక రాశికి లేదా 30 డిగ్రీలకు తయారుచేస్తే అవి ఆ రాశిలోని 150 నాడీ అంశాలను సూచిస్తుంది. ఇది ఋషులు చెప్పిన సమ విలువ అంశ చాపానికి భిన్నంగా ఉంటుంది. దీనినే సైంటిఫిక్ ధీయరీ అని CS పటేల్ వంటి అనేక మంది జ్యోతిష్కులు తెలియచేస్తున్నారు. ఉదాహరణకు పారంపర్య వసుధ నాడీ అంశ 12 ని. అయితే ఈ భిన్నమైన పద్దతిలో అది 30 ని. సూచిస్తుంది.  తరువాత నాడీ అంశ కేవలం 10 ని. లే సూచిస్తుంది. కానీ శాస్త్ర విలువ 12 ని. .. ఈ షోడశ వర్గ అంశలు 150 నాడీ అంశలను సూచించటమే గమనించతగ్గ అంశము.  


ఈ విలువలన్నింటిని సమ, అసమ అన్న భేధముతో అన్నీ నాడీ అంశలను వీడియో రూపములో అందిస్తున్నాను. ఇంత వివరముగా ఆడియోలో చెప్పడం కుదరదు కాబట్టి పూర్తిగా ధ్వని రహిత దృశ్య రూపములో పూర్తి విలువలను చూడండి. నాడీ అంశలలో కూడా జాతక విశ్లేషణ చేసేవారికీ ఈ వివరాలు పూర్తిగా దోహదపడతాయి. అందుకోసమే ఒక్కో నాడీ అంశ అన్నీ రాశులలో ఏ యే డిగ్రీల నుండి మొదలై అంతమవుతుందో వివరముగా ఇవ్వడమైనది. ఈ నాడీ అంశలు ఒక్కొక్కటి ఒక్కో నవాంశ రాశికి సమానమని పరిశోధనలో బయటపడినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు కూడా Navamsa & Nadi Astrology అనే పుస్తకం ద్వారా ఇదివరకే CS Patel తెలియచేశారు. వాటిపై విస్తృత పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇవి భవిష్యత్తులో మంచి ఉపయోగకరమైన నాడీ జ్యోతిష శాస్త్ర అభివృద్దికి సోపానం. 
ఈ వీడియోలన్నీ నా youtube చానెల్ నందు వీక్షించగలరు. 
ఒక్కో వీడియో 3 డిగ్రీల చాపములో ఉన్న 15 నాడీ అంశలను సూచిస్తుంది. ఇది అక్షయ లగ్న పద్దతిలో ఒక్కో సం. రానికి సమానం. ఈ విధంగా కూడా విశ్లేషణ చేసుకోవచ్చు. 


సందేహాలు ఉన్నవారు నా వాట్సాప్ కి మెసేజ్ చేయగలరు. ఈ సౌకర్యం నా బ్లాగ్ aobastrology ఫాలో అవుతున్నవారికి మాత్రమే... 

Wednesday, 14 July 2021

గోచార విశేషం

 కుజ, శుక్రుల సింహా ప్రవేశం.

రాబోయే 21/7/2021 నుండి గ్రహ చారములో జరిగే మార్పులలో కుజుడు, శుక్రుడు సింహ రాశిలో ప్రయాణిస్తారు. వీరికి కేంద్రాలలో రాహువు, కేతువు 4, 10 స్థానాలలో ఉంటారు. సింహా రాశికి మేషము భాధక స్థానము, అందరికీ తెలిసిన విషయమే... ఆ విధంగా కాల పురుష లగ్నాధిపతి తనే భాధకుడిగా గోచార ప్రయాణం. అలాగే నైసర్గిక సప్తమ స్థాన అధిపతిగా శుక్రుడు తన స్థానానికి తానే భాధక స్థానములో ప్రయాణించటం. అంటే నైసర్గిక లగ్న, సప్తమ అధిపతులు తమ తమ స్థానాలకు తామే భాధకులుగా రావడం అంటే స్వంత ఇంటికి తామే నిప్పంటిచుకోవడం. అంటే ఆత్మహుతి లాంటిది. అందులోనూ గురువు దృష్టి ఎదురుగా ఉన్న ఆ గురువు ప్రయాణం తన నీచ స్థానం వైపు, వక్రించడం వలన.... అంతే కాక దిశ శని, ప్లూటో వైపు... ఇక్కడ ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే మీన అధిపతిగా గురువునే కాకుండా పాశ్చాత్య పద్దతిలో నెప్టూన్ కూడా 26/6/21 నుండి వక్రించడం మరొకటి. కాబట్టి గురువు యొక్క సంపూర్ణ వక్రత్వం కనబడుతుంది. ఈ కారణముగా నైసర్గిక పుత్ర స్థానం నుండి అష్టమ స్థానం వక్రత్వం మంచిది కాదు. అందుకే ప్రపంచం మొత్తం పిల్లల ఆరోగ్య స్థితిగతుల పై దృష్టి కనపరుస్తూ రాబోయే మూడవ కరోనా విజ్రంభన అందుకు సూచనగా జ్యోతిష పండితులు సూచించడం జరిగింది. 

రేపు జరగబోయే కర్కాటక సంక్రమణం నుండి నెల రోజుల పాటు సూర్యుడు కూడా జల రాశి ప్రవేశం, తన స్థానానికి వ్యయముగా ... కాబట్టి గోచార స్థితి ఏమాత్రం ఆశ జనకముగా లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ జాగ్రత్తలలో ఉండండి. ప్రాప్తం నుండి జీవి ఎన్ని పరిహారాలు చేసుకున్నా తప్పించుకోవడం అసాధ్యం. 

స్థితిని అర్ధం చేసుకోండీ ,,, అనుకూలముగా వ్యవహరించండి.  

సందేహాలు ఉన్నవారు నా వాట్సాప్ కి మెసేజ్ చేయగలరు. ఈ సౌకర్యం నా బ్లాగ్ ఫాలో అవుతున్నవారికి మాత్రమే...    

Sunday, 11 July 2021

Kota chakra అవసరం - నిర్మాణం.

KOTA CHAKRA  - కోట చక్రం

గోచారములో గ్రహములు 28 నక్షత్రాలపై ఎలా ప్రయాణిస్తుందో వివరించి చెప్పేది ఈ చక్రము యొక్క ఆంతర్యం. 

ఒక జీవి జాతకములో ఉన్న గ్రహములలో ఆ జీవికి మేలు చేసేవి, కీడు చేసేవి ఉంటాయి. ఆ గ్రహములకు జాతకముతో సంబందం లేకుండా వాటి కేరక్టర్ ద్వారా శుభ/అశుభ గ్రహములుగా మహర్షులు చెప్పటం జరిగింది. ఉన్న ద్వాదశ రాశులను బట్టి ఈ గ్రహములు యోగా కారకములుగా లేదా శుభ/ అశుభ గ్రహములుగా కూడా విడి విడిగా చెప్పటం జరిగింది. కాల చక్రమును రెండు భాగములుగా చేస్తే మొదటిది క్షేత్రజ్ణుడు ఉన్న భాగానికి రెండవది శత్రు భాగమవుతుంది. అంటే లగ్నము 'ధర్మ' సంజ్ణ అయితే సప్తమము అన్నది విధిగా పురుషార్ధములలో మూడవది అయిన 'కామ'  సంజ్ణ అవుతుంది. అంటే జీవి తన గత జన్మ కోరికల ఆకారముతో ఈ జన్మను సాధించడమే అక్కడి ఆంతర్యం.  

గ్రహ చారము కొద్ది చెడు చేసే గ్రహములు కోట అంతర్భాగాన్ని చేరి ధ్వంసం చేస్తే ఆ జీవి మనుగడ అంతమవుతుంది అన్న దానికి సూచనగా ఈ కోట చక్రాన్ని విశ్లేషణ చేస్తారు. ఈ కోటకు కోట స్వామి, కోట పాలకుడు అన్న పేరుతో రెండు భిన్న గ్రహములు (తొమ్మిదింట్లో) పాలకులుగా ఉంటారు. కోట స్వామి నిర్ణయం చంద్రుడు ఉన్న నక్షత్ర రాశి అధిపతి తీసుకుంటాడు. కోట పాలకుడు చంద్రుడు ఉన్న నక్షత్ర పాద అధిపతి నిర్ధేశిస్తాడు. కోట స్వామి ఎవరూ అన్నది తెలుసుకోవడం తేలిక. కోట పాలకుడికి మాత్రం క్రింది పట్టిక చూసి నిర్ణయించాలి. 

                                     పాదం 1                   పాదం 2             పాదం 3                 పాదం 4 

01. అశ్విని :                    శుక్ర                         శుక్ర                      శుక్ర                      చంద్ర

02. భరణి :                    చంద్ర                       చంద్ర                     చంద్ర                     చంద్ర 

03. కృత్తిక :                     రవి                          రవి                      రవి                       రవి 

04. రోహిణి :                  రవి                         చంద్ర                    చంద్ర                     చంద్ర

05. మృగశిర :                చంద్ర                       చంద్ర                     కుజ                      కుజ

06: ఆర్ద్ర :                       కుజ                         కుజ                     కుజ                       శుక్ర

07. పునర్వసు :               కుజ                          కుజ                    రాహు                    రాహు

08. పుష్యమి :                 రాహు                      రాహు                  రాహు                   బుధుడు

09. ఆశ్లేష :                   బుధుడు                    బుధుడు                బుధుడు                  బుధుడు

10. మఖ :                       శని                         శని                      శని                      శని

11. పుబ్బ :                        శని                      బుధుడు                 బుధుడు                  బుధుడు   

12. ఉత్తర :                     బుధుడు                   బుధుడు                  శని                        శని

13. హస్త :                        శని                       రాహు                 బుధుడు                  బుధుడు

14. చిత్త :                         శని                        శని                     చంద్ర                    చంద్ర

15. స్వాతి :                      చంద్ర                     చంద్ర                    చంద్ర                    గురువు

16. విశాఖ :                   గురువు                   గురువు                గురువు                   గురువు         

17. అనురాధ :                 గురువు                  గురువు                 గురువు                   గురువు

18. జ్యేష్ట :                      గురువు                   చంద్ర                    చంద్ర                      చంద్ర  

19. మూల :                    చంద్ర                    చంద్ర                     శని                        శని             

20. పూర్వాషాడ :             శని                     గురువు                   శని                      బుధుడు

21. ఉత్తరాషాడ :               శని                       శని                      శుక్ర                        శుక్ర

22. శ్రవణ :                      కుజ                      కుజ                      కుజ                        కుజ  

23. ధనిష్ట :                      కుజ                       కుజ                      కుజ                        కుజ

24. శతభిష :                   కుజ                     రాహు                    రాహు                     రాహు 

25. పూర్వాభాద్ర :            రాహు                    రాహు                    గురువు                   గురువు

26. ఉత్తరాభాద్ర :            గురువు                   గురువు                     శుక్ర                       శుక్ర

27. రేవతి :                   గురువు                   గురువు                     శుక్ర                       శుక్ర


నిర్మాణం 


1. ఎవరి కోట చక్రం నిర్మించాలో వారి జన్మ తార విధిగా మొదటి సంఖ్య నుండి మొదలవ్వాలి. 
2. వరుస నక్షత్రాలు పూర్తిగా తెలిసి ఉండి, వరుస సంఖ్యలలో అంటే 1, 2, 3 ... అలా వేసుకుంటూ చక్ర నిర్మాణం చేయాలి. 
3. అభిజిత్ నక్షత్రాన్ని ఉత్తరాషాడ తరువాత తీసుకోవాలి. 
4. మీ లగ్నానికి యోగా కారక గ్రహం ఏ నక్షత్రములో ఉందో గ్రహించండి. 
5. యోగా కారక గ్రహాలు తెలుసుకోవాలి అంటే నా పోస్టు " హోర నిర్ణయ సంగ్రహం'' చూడండి.  
6. కోట స్వామి, కోట పాలకుడు ఒక్కరే అయితే ఆ అనుకూలత జాతకుడికి లాభిస్తుంది. కారణం మొత్తం చక్రములో గమనించే గ్రహం ఆ ఒక్కటే అవుతుంది. 
7. దుర్గం లో ఉన్న నక్షత్రాలలో శని, రాహు, కేతు గ్రహ చార రీత్యా ప్రయాణిస్తున్నప్పుడూ జాతకుడికి ఆరోగ్య స్థితులలో మార్పులు వస్తాయి. జీవితం అనే కోటకు స్తంభం అనే మూలాధారం, అశుభ గ్రహాల తాకిడికి బీటలు పడతాయి అన్నది అంతరార్ధం. ఈ తీవ్రత ఎక్కువైతే అంటే శుభ గ్రహాల ఉనికి బాహ్య ప్రాకారానికి పరిమితి అయితే జాతకుడికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదాన్ని సూచనగా ఈ చక్రం అందచేస్తుంది. 
8. ఈ దుర్గం లో ఉన్న నక్షత్రాలు జాతకుడి జన్మ తార మొదలుకొని 4, 11, 18, 25వ నక్షత్రాలు ఉంటాయి. అందులో 18వది గండాంత నక్షత్రం. సహజముగా ఉండే గండాంత నక్షత్రాలు, జన్మ రీత్యా వచ్చే గండాంత నక్షత్రాలు అని మొత్తం 6+6=12 నక్షత్రాలు విశ్లేషణలో మనం తీసుకుంటాము. జాతకుడి లాభ, నష్టములు ఈ 12 నక్షత్రాలు, 22వ వైనాశిక నక్షత్రం, గ్రహాల రీత్యా ఉచ్చ, నీచ స్థితి లభించిన గ్రహ నక్షత్రములు నిర్ధేశిస్తాయి. 
9. మన నిత్య జీవితములో ట్రాఫిక్ నియంత్రణకు one-way అని ఎలా ఉంటుందో అలాగే గ్రహం కోట చక్రం లోని గ్రహ గోచార దిశకు వక్రించినపుడు వ్యతిరేకముగా ప్రయాణిస్తుంది. అంటే సహజ శుభ గ్రహాలు అయిన గురువు, శుక్రుడు దుర్గం లో ప్రవేశించేటపుడూ వక్రీస్తే అవి లోపలికి రావడానికి తిరస్కరించినట్లు... అందువల్ల జాతకుడికి వచ్చే శుభాలు రానట్లే లేదా ఇవ్వడములో కాల హరణం జరిగినట్లు. అదే పాప గ్రహాలు ఆ స్థితిలో వక్రీస్తే రాబోయే కష్టాలు తప్పినట్లు లేదా కష్టాలు రావడములో జాప్యం జరిగినట్లు. 
10. ఈశాన్యం నుండి మొదలయ్యే నక్షత్రాలు ఉత్తరం తో ముగుస్తుంది. ఇలా మొదలయ్యే నక్షత్రం కూడా మంచిదే అయితే లగ్న రాశికి సంబందించి జీవితం అనుకూలం గా ఉంటుంది.      
సందేహాలు ఉన్నవారు నా వాట్సాప్ కి మెసేజ్ చేయగలరు. ఈ సౌకర్యం నా బ్లాగ్ ఫాలో అవుతున్నవారికి మాత్రమే...

Thursday, 8 July 2021

Why we need answer to WHO AM I? questioned by Sree Ramana Maharshi. ....

WHO AM I? 

మహానుభావుడు శ్రీ రమణ మహర్షి అడిగిన ప్రశ్న విచిత్రమైన,  ఆలోచిస్తే అంతరార్ధం భగవద్గీత పొంతన తో అర్ధం అవుతుంది. శరీరము వాహనమైతే, ఆ శరీరం మోసే కారక శరీరం ఇంకొకరిది అన్న విషయం అర్ధం అవుతుంది. అందుకే నీవు ఎవరో తెలిస్తే నీకు అన్నీ భోధ పడుతుంది అన్న సమాధానములో ఎంతో ఆత్మ జ్ణాన ప్రహేళిక అర్ధం అవుతుంది. ఇక మన మెవరో తెలియని స్థితిలో మనం ఏమి చేసిన అది కృష్ణ/శివ మాయ గా బావిలో కప్పలా పెద్ద విశ్వముగా గోచరిస్తుంది. చేసే కొని పనులు ఆత్మ జ్ణానికి హాస్యా స్పదంగా గోచరిస్తుంది. ఉదాహరణకు మనకు మనమెవరో తెలియదు, కానీ సంకల్పములో మన ఊరూ, పేరు చెప్పుకొని చేసే పనులు అతి గొప్పగా సాధ్యమైనంత మందితో షేర్ చేసుకుంటాము. అంతే కాక సంకల్పముతో చేసే పూజలను బట్టి మనమే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులం అన్న అహంకారము కూడా ఈ మాయే తయారుచేస్తుంది. ఇవన్నీ మాయ అని తెలిసిన వారు చేసే పనులు జన జీవన విధానానికి భిన్నంగా ఉంటూ ప్రత్యేకముగా ఉంటారు. వర్తమాన జీవితములో ఇంకొకరికి వాహనమైన జీవి ఈ మాయలో ఏ నాటికి '' నేను'' అన్న ఉనికిని దాటి ఆలోచించడు. కానీ కానీ రమణ మహర్షి లాంటి వారిని అనుసరిస్తారు, వారి గురించి గొప్పగా చర్చలు చేస్తారు. అక్కడ కూడా నేనే ఆ విషయం మీద వాదన చేసాను అని తన గురించి చెప్పుకుంటాడు. 

ఆత్మ జ్ణానానికి, సాధారణ మన తెలివి తేటలకు ఇంత వైరుద్యo, భిన్నత ఉన్నప్పుడూ జ్యోతిష శాస్త్ర పరంగా పరిహారాలు, రెమిడీలు అన్నవి ఎవరు చేస్తున్నట్లూ, వాటి ఫలితం ఎవరికి వెలుతున్నదో ఆలోచించరు. తెలిసి చేసిన తప్పులకు చేసుకునే పరిహారాలకు తనే కర్త గా వాటిని పరిహరించుకోవచ్చు. కానీ తెలియక చేసిన తప్పులు, తనవి కానీ అంటే కారక శరీరం అంటే తనూ మోసే ఆత్మ తాలూకా తప్పులకు పరిహార క్రియలు చేద్దామంటే సంకల్పం ఎవరు చెప్తారు? జీవి ఎలా చేస్తాడు? ఇవన్నీ ఆలోచించక చేసే అవకతవక క్రియలతో మరింత పాపాలను పెంచుకుంటూ మానవుడు మరిన్నీ జన్మలకు బద్దుడు అవుతున్నాడు. ఇటువంటి తరుణములో మోక్షం గురించి జాతకాలు చూపించుకోవడం ఎంత హాస్యాస్పదమో ఆలోచిస్తే అవగతమవుతుంది. తామర తంపరగా పెరుగుతున్న ప్రజానీకం చేసిన పాపాలకు సాక్షి భూతంగా అయితే నిజంగా మోక్షం అన్నది ఉంటే జీవులు తగ్గుతారా? పెరుగుతారా? మీరే ఆలోచించండి.

లోకరీతిలో ప్రజలు వారి శరీర ఆకృతి వల్ల తగిన గౌరవం పొందు తారు. పరిచయాలు పెరిగి మనస్తత్వాలు వెల్లడయ్యాక నిజంగా వారు ఏమిటో లోకానికి తెలుస్తుంది. కొందరికి అందం లేకపోయినా లోక ప్రసిద్దమైన కార్యాచరణ వల్ల వారు చరిత్ర ప్రసిద్ధులవుతారు. జాతిపిత మహాత్ముడిది, సాధారణ రూపమే అయినా ఆయన లోక జనప్రియులై ఆరాధ్యులయ్యారు. చేసింది గాంధీ గారు కాకపోయినా ఆయనలోని కారక శరీరం యొక్క కోరిక ఈ రూపేణా తీర్చుకోవడానికి వచ్చిందని తెలుసుకుంటే చిత్రంగా ఉంటుంది. కానీ అది సత్యం .. దేహ భ్రాంతి అన్నది జీవులను మాయలోకి తీసుకు వెళ్లకపోతే ఇవన్నీ జరిగేది కావేమో. 

రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి మహనీయులు తమ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లడం, స్వామి వివేకానంద యువతను ప్రభావితం చేసిన తీరు వారిలోని ఆత్మ శక్తి వల్ల సాధక హృదయాల్లో ఆరాధ్య స్థానం సంపాదించుకోవడం అన్నది ముఖ్యంగా గుర్తించాలి. దేహ సౌందర్యం, దైహిక సుఖాలూ ఒక భ్రాంతి, నశించే తత్వానికి అవి ప్రతీకలు. అవి గుర్తించారు కనుకనే ఆ మహనీయు లకు దేహభ్రాంతి లేదు. శరీర ఆకృతికి, అందానికి వారి వద్ద స్థానం లేదు. భ్రాంతి వీడినవారు కాబట్టి వారు ఆత్మను ప్రత్యగాత్మతో అనుసంధానం చేసి సాధనలో పరిపక్వత పొందగలిగారు.  

ఇంతమంది తెలిసి ఉండి సాధారణ జీవి తన కర్మ తీవ్రత వల్ల మాయను పోగొట్టుకోలేక 'బుద్ది కర్మాణుసారిణి' అన్న వేదోక్తి ప్రకారం తన మనుగడ సాగిస్తాడు. పరిపక్వత ఒక్కటే ప్రభావితం చేసే దిశ అవుతుంది. అందులో భాగమే తనెవరో తెలుసుకోవడం అన్నది ఒక మైలురాయి. అందుకు ఉపయోగపడేది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం. అంతే కానీ పరిహారాల పేరిట జీవన పరంపర ను అనుభవించడం కాదు. ఆవిర్భవించడం ఒక్కడే ... నశించడం లేదా తిరిగి వెనక్కి మళ్లడం ఒక్కటే ... కేవలం పరిపక్వత, పరిణితి మాత్రమే వ్యక్తిగతంగా అభివృద్ది పధాన్నిసూచిస్తుంది.    


                      

Wednesday, 7 July 2021

నక్షత్ర దృష్టి - Star Sight

నక్షత్రాలు - కొన్ని సూచనలు  


మూల నక్షత్రం మొదలుకొని ప్రతి నక్షత్రానికి కొన్ని ప్రత్యేక దృష్టులు చెప్పడం జరిగింది. వీటిని వేదిక్ జ్యోతిష పరంగా పరాశర మహర్షి సూచించడం జరిగింది. అవే అధోముఖ, ఊర్ధ్వ ముఖ మరియు తిర్యఙ్మఖ నక్షత్రాలు. 

అధోముఖ దృష్టి : ఈ నక్షత్రం పై ఏదేని గ్రహం ఉన్నచో లేదా లగ్నమే ఆవిర్భవించిన జాతకుడి దృష్టి మానసిక అంతరార్ధము పై కేంద్రీకరించి ఎదుటివాడి ఆలోచనలు పసిగట్టటమే వీరి నైజాం. అలాకాక కుజ, శని గురువు లాంటి గ్రహాలు ఉంటే వాటి దృష్టి చివరి నుంచి మొదలవుతుంది. అంటే ఉదాహరణకు శని ఉంటే దశమ దృష్టి మొదలై తన మహా దశలో తృతీయ దృష్టితో అంతమవుతుంది. దీని వల్ల జాతకుడికి ప్రారంభములో వివాహం లేదా ఉద్యోగ స్థితిలో ఆరోహణ వంటివి జరుగుతుంది. చివరిలో తన ఆప్తుల రోగ/మరణాలు వంటి సంఘటనలు ఎదురు అవుతాయి. ఈ నక్షత్రాలలో బావులు త్రవ్వడం, ఆర్కియాలజీ తవ్వకాలు జరపడం, నిధులు నిక్షేపాల కోసం అన్వేషణ, లోహ సంబందిత గనుల తవ్వకాలు, గుహలు వంటి నిర్మాణం మరియు జీవికి సంబందించి అంతర్ముఖ అన్వేషణ వంటివి చేయవచ్చు.  

ఈ దృష్టి ఉన్న నక్షత్రాలు :: భరణి, కృత్తిక, ఆశ్లేష, మఖ, పుబ్బ, విశాఖ, మూల, పూర్వాషాడ, మరియు పూర్వాభాద్ర నక్షత్రాలు(9).

ఊర్ఢ్వ ముఖ దృష్టి : ఈ నక్షత్ర దృష్టి హెచ్చులు చెప్పుకోవడం దగ్గర నుంచి జీవిలో over కాన్ఫిడెన్స్ పెంచే దుర్గుణాల వరకు కొనసాగుతుంది. అదే ఈ నక్షత్రాలలో శుభకరమైన పరిణామాలు అంటే రోదసీ యాత్రలు, ప్రయోగాలు, యుద్ద సంబందమైన మిసైల్స్ ఉపయోగం, జాతకుడి జీవన యాత్రలో అభివృద్ది పధం క్రింద చెప్పా బడిన కార్యక్రమాలు అంటే ఉద్యోగం, వివాహం, నూతన పదవుల ఆరంభం, సన్మానం వంటివి వస్తాయి. ఈ నక్షత్రాలలో ఉన్న గ్రహాల సప్తమ దృష్టి మొదట ప్రారంభ మవుతుంది. 

ఈ దృష్టి ఉన్న నక్షత్రాలు :: రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, ఉత్తర, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తర భాద్ర నక్షత్రాలు (9).

తిర్యఙ్మఖ దృష్టి :: నిత్య జీవితానికి ఉపయోగపడే నక్షత్రాలలో ఈ దృష్టి ఉన్నవి మంచిది. ఈ దృష్టి ఉన్నవారు Straight Forward గా ఉండటం, ఒక అడుగు తరువాత మరో అడుగు లాగా పని తరువాత పని అంచెలంచెలుగా చేయడం వీరి అభీష్టం.  వ్యవసాయం, నీటి పారుదల, రహదారుల నిర్మాణం, వాహన చొధకులు (Drivers), స్నేహితులతో కలయక, వాహన విక్రయాలు, వ్యాపార సంబంద కలయక, ట్రేడింగ్ (షేర్) వంటివి అనేకం ఈ నక్షత్ర రోజుల్లో చేయవచ్చు. ఈ నక్షత్రాలలో శని ఉంటే మొదటి దృష్టి తృతీయం, తరువాత సప్తమమ్ చివరన దశమ దృష్టి ఆక్టివేట్ అవుతుంది. 

ఈ దృష్టి ఉన్న నక్షత్రాలు :: అశ్విని, మృగశిర, పునర్వసు, హస్త, చిత్త, స్వాతి అనురాధ, జ్యేష్ట మరియు రేవతి నక్షత్రాలు(9).     

ఇక్కడ అతి ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవలసినది ... గ్రహాలకు కూడా ఇటువంటి దృష్టే ఉంది. ఆ గ్రహాలు తమ అనుకూలమైన దృష్టి ఉన్న నక్షత్రాలలో పడితే తమ తమ బావాలకు అనుగుణమైన ఫలితాలు వెంటనే ఇస్తాయి. లేదంటే కొద్ది తేడా ఉంటాయి. 

మీ కోసం గ్రహాలకు ఉన్న దృష్టులు కూడా ఇస్తున్నాను. 

సూర్యుడు: ఊర్ఢ్వ ముఖ దృష్టి

చంద్రుడు: ఊర్ఢ్వ ముఖ దృష్టి

కుజుడు: అధోముఖ దృష్టి 

బుధుడు: తిర్యఙ్మఖ దృష్టి

గురువు: ఊర్ఢ్వ ముఖ దృష్టి

శుక్రుడు: తిర్యఙ్మఖ దృష్టి

శని: అధోముఖ దృష్టి 

రాహువు: అధోముఖ దృష్టి (ఉన్న నక్షత్రం అనుసరించి..)

కేతువు: అధోముఖ దృష్టి  (ఉన్న నక్షత్రం అనుసరించి..)      


గమనించతగ్గ విషయం : 

రాహు, కేతువుల విషయములో అధోముఖ దృష్టి కేవలం వారి నక్షత్రాలలో ఉన్నప్పుడే ... అదే వేరే గ్రహ నక్షత్రాలలో ఉంటే అందుకు తగినట్లు దృష్టి మారుతుంది. 


నక్షత్ర దృష్టులలో ప్రత్యేకమైనది మరొకటి ఉంది. అవి అంధ, మంద, మధ్య మరియు సులోచన అన్న సూచికలతో ఉదహరింపబడ్డవి. విడివిడిగా వీటిని అర్ధం చేసుకుంటే దృష్టి యొక్క పరిణితిని చూడవచ్చు. 

అంధ : అర్ధం గుడ్డిది అని, కానీ ఇక్కడ నక్షత్రానికి ఉన్న దృష్టి సంబందమే కానీ గ్రహానికి కాదు అన్నది గ్రహించాలి. 

మంద : అర్ధం స్పష్టత లేని చూపు. అంటే గుడ్డి కన్నా మేలైనది అని అర్ధం అవుతుంది. 

మధ్య : అర్ధం మధ్యస్తమే... అంటే పూర్తి స్పష్టత లేనిది అని అర్ధం అవుతుంది. 

సులోచన: అర్ధం స్పష్టత కలిగిన నిశీతమైన చూపు. ఈఫి శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. 

ఈ నాలుగు రకముల దృష్తులను వ్యక్తపరచే నక్షత్రాలను చూద్దాం. 

అంధ నక్షత్రాలు: రోహిణి, పుష్యమి, ఉత్తర, విశాఖ, పూర్వాషాడ, ధనిష్ట మరియు రేవతి. 

మంద నక్షత్రాలు: అశ్విని, మృగశిర, ఆశ్లేష, హస్త, అనురాధా, ఉత్తరాషాఢ, మరియు శతభిష. 

మధ్య నక్షత్రాలు: భరణి, ఆర్ధ్ర, మఖ, చిత్త, జ్యేష్ట, అభిజిత్ మరియు పూర్వాభాద్ర,

సులోచన నక్షత్రాలు: కృత్తిక, పునర్వసు, పుబ్బ, స్వాతి, మూల, శ్రవణ మరియు ఉత్తర భాద్ర.    

ఇవి అధిక భాగం ప్రశ్న శాస్త్రానికి ఉపయోగపడుతుంది. అంధ నక్షత్ర రోజున దొంగతనమునకు గురి కాబడిన వస్తువు తూర్పున దొరుకుతుంది అని చెప్పవచ్చు. 

అదే మంద నక్షత్ర రోజున దొంగతనమునకు గురి కాబడిన వస్తువు దక్షిణ దిక్కులో సుమారుగా 4 రోజుల వ్యవధిలో అతి కష్టం మీద దొరుకుతుందని చెప్పవచ్చు. 

మధ్య నక్షత్ర రోజున వస్తువు పోతే అది పడమటి దిక్కున నెల నుండి 3 నెలల లోపు దొరుకుతుందని చెప్పవచ్చి. 

సులోచన నక్షత్ర రోజున జరిగిన సంఘటనలకు ఉత్తర దిక్కు సాక్షిగా నిలుస్తుంది. అయితే వస్తువు వెంటనే దొరకవచ్చు లేదా ఆ దొంగతనం గురించిన అతి ముఖ్యమైన విషయం లభిస్తుంది. వస్తువు దొరకక పోవచ్చు లేదా ఆసక్తి తగ్గవచ్చు. 

పైన చెప్పబడిన అన్నీ ఉదాహరణలకు చంద్రుడు ఉన్న నక్షత్రమే ప్రామాణీకముగా చూడాలి. 

Some more known variations of Star Characters

1. Chara Nakshatra: Saravana, Dhanishta, Satabhisha, Punarvasu and Swati. 

These nakshatras are more useful for movement oriented activities.

2. Sthira Nakshatras:  Rohini, Uttaraphalguni, Uttarashadha and Uttarabhadra.

For standard activities like marriages, tree planting, House construction etc. 

3. Mridu Nakshatras:  Chitra, Anuradha, Mrigashira and Revati.  

For activities like expressing love, honouring elders, starting physical fitness actions, and many cultural and social upliftment.  

4. Ugra Nakshatras: Bharani, Magha, Purvaphalguni, Purvashadha and Purvabhadra. 

These nakshatras more useful for aggressive action oiented, demolishing works, chemical & ammuniation experiments etc.,

5. Tikshna Nakshatra: Moola, Jyeshta, Ardra and Ashlesha. 

These are Gandanta Stars, meaning ending of anything like separation and burying, drowning firing, death like activities etc., 

6. Kshipra Nakshatra: Ashvini, Pushya, Hasta and Abhijit 

are known nakshatras for finishing any work quickly. Shopping, Racing, maintaining relationships, Physical treatment, short Travels etc., 

7. Mishra Nakshatra: Krttika and Vishakha 

known for both cruelty and satwic Guna. So nature is mixed. Power seeking activities like politics entry these stars are more useful. 

Obsere Vidhi (Ascendant), Madhi(Moon) and Gati(Lagna Lord) concept for these stars qualities. 

If vidhi or karmic orientation of Jeeva is more straining lagna may found in ugra or Theekshana nakshatras. If it is light weight you may find lagna in other stars. Like wise Gati, the movement of Jeeva is characterized through lagna lord dispositor nakshatras. In this was mind also can be assessed through nakshatra of Moon as madhi. Entire character of native can be imagine like a diagram. 

సందేహాలు ఉన్నవారు నా వాట్సాప్ కి మెసేజ్ చేయగలరు. ఈ సౌకర్యం నా బ్లాగ్ ఫాలో అవుతున్నవారికి మాత్రమే... 

For doubts or clarifications contact my WhatsApp. This facility is only for the followers of blog. 

Nakshatras - Shakti - Mythological Characters

LAGNA NAKSHATRAS - MYTHOLOGICAL CHARACTERS Aswini :: Nakula & Sahadev, Aswaddhama Bharani :: Rahu,    Krittika :: Lord Subramanyam,  Roh...