కుజ, శుక్రుల సింహా ప్రవేశం.
రాబోయే 21/7/2021 నుండి గ్రహ చారములో జరిగే మార్పులలో కుజుడు, శుక్రుడు సింహ రాశిలో ప్రయాణిస్తారు. వీరికి కేంద్రాలలో రాహువు, కేతువు 4, 10 స్థానాలలో ఉంటారు. సింహా రాశికి మేషము భాధక స్థానము, అందరికీ తెలిసిన విషయమే... ఆ విధంగా కాల పురుష లగ్నాధిపతి తనే భాధకుడిగా గోచార ప్రయాణం. అలాగే నైసర్గిక సప్తమ స్థాన అధిపతిగా శుక్రుడు తన స్థానానికి తానే భాధక స్థానములో ప్రయాణించటం. అంటే నైసర్గిక లగ్న, సప్తమ అధిపతులు తమ తమ స్థానాలకు తామే భాధకులుగా రావడం అంటే స్వంత ఇంటికి తామే నిప్పంటిచుకోవడం. అంటే ఆత్మహుతి లాంటిది. అందులోనూ గురువు దృష్టి ఎదురుగా ఉన్న ఆ గురువు ప్రయాణం తన నీచ స్థానం వైపు, వక్రించడం వలన.... అంతే కాక దిశ శని, ప్లూటో వైపు... ఇక్కడ ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే మీన అధిపతిగా గురువునే కాకుండా పాశ్చాత్య పద్దతిలో నెప్టూన్ కూడా 26/6/21 నుండి వక్రించడం మరొకటి. కాబట్టి గురువు యొక్క సంపూర్ణ వక్రత్వం కనబడుతుంది. ఈ కారణముగా నైసర్గిక పుత్ర స్థానం నుండి అష్టమ స్థానం వక్రత్వం మంచిది కాదు. అందుకే ప్రపంచం మొత్తం పిల్లల ఆరోగ్య స్థితిగతుల పై దృష్టి కనపరుస్తూ రాబోయే మూడవ కరోనా విజ్రంభన అందుకు సూచనగా జ్యోతిష పండితులు సూచించడం జరిగింది.
రేపు జరగబోయే కర్కాటక సంక్రమణం నుండి నెల రోజుల పాటు సూర్యుడు కూడా జల రాశి ప్రవేశం, తన స్థానానికి వ్యయముగా ... కాబట్టి గోచార స్థితి ఏమాత్రం ఆశ జనకముగా లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ జాగ్రత్తలలో ఉండండి. ప్రాప్తం నుండి జీవి ఎన్ని పరిహారాలు చేసుకున్నా తప్పించుకోవడం అసాధ్యం.
స్థితిని అర్ధం చేసుకోండీ ,,, అనుకూలముగా వ్యవహరించండి.
సందేహాలు ఉన్నవారు నా వాట్సాప్ కి మెసేజ్ చేయగలరు. ఈ సౌకర్యం నా బ్లాగ్ ఫాలో అవుతున్నవారికి మాత్రమే...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.