Thursday, 27 May 2021

Jyotish - A realisation.

ఓం ప్రధమముగా 

నాకు జన్మ నిచ్చిన తల్లితండ్రులకు 

నా గురు దేవులకు 

తెలియని మహా చైతన్య శక్తికి 

చైతన్య శక్తి ఆధారముగా నాలో ఉన్న కారణ శరీరానికి  

ఇవే నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు



గుణాలు 3 అని, వాటిని ఆధారం చేసుకొని బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడిని సృష్టించడమో, తన బలహీనతకో, భయానికో తన్నూ చూసే పెద్దవాడు అని మొత్తానికి భగవంతుడిని ఆవిర్భవింప చేశాడు మానవుడు. రంగు, రుచి, ఆకారం లేని శక్తి కి తన ఊహాశక్తి తో తన లాగే ఆకారమును దేవుడిగా  ప్రతిష్టించి, ఆ శక్తిని నమ్మాను కాబట్టి చేసిన అవకతవకలుకూ ఆయన అండ ఉంటుందని నమ్మడం అదే విధంగా పూజించడం జరుగుతూ వస్తోంది. కాల క్రమేణా అది స్వార్ధం గా మారి ఆ దేవుడిని కోరికలు కొరటం వరకు వచ్చింది. అందుకోసం ప్రత్యేకమైన ఏర్పాటులతో విచిత్రమైన పూజలు, అలంకారాలు చేయడం, ఎదుటి మనిషిని తన స్వార్ధం కోసం ఈ పూజలతో హోరెత్తించడం .. చివరికి అదే దేవుడిని తనూ వ్యాపార ధోరణితో ఉపయోగించుకోవడం జరుగుతున్నది. 

అదే జీవి తను ఎవరో, ఎందుకు పుట్టడం జరిగిందో  ఇప్పటి వరకు తెలియక పోయినా మాయ అనే  అహంకారం తో తనో ప్రత్యేకం అని ప్రతి జీవి అనుకోవడం, ఆ విధంగా నడుచుకోవడం జరుగుతోంది. అది తెలిసిన వారు గుంభనంగా ఉంటూ నీ జ్ణానముతో నీవే తెలుసుకో అని భోధ చేయడం జరుగుతోంది. ఇందుకు కారణం మన చుట్టూ ఉన్న మాయే ... మన శరీరం ఒక వాహనం అని, కారణ శరీరం అనేది ప్రతి జీవిలో ఒకటుందని  శాస్త్రాలు చెప్పిన, జ్ణానులు నీవు ఎవరు? అని ప్రశ్నించిన అది అర్ధం కానీ రీతిలో ఈ జగత్తు విచిత్రముగా నడవడమే. అది ఒకరు చెబితే అర్ధం అయ్యేది కాదు ... ఎవరికి వారు తెలుసుకోవాలన్న సత్యము. 

మనలను నడిపే శక్తి మన పూర్వీకులలో ఒకరు అనుకుంటే, గతములో నిర్వర్తించని కర్మ లను ఈ శరీరముతో పూర్తి చేయడానికి వచ్చిందన్న నిజాన్ని గ్రహించవచ్చు. తద్వారా తన ఋణబంధాలను తీర్చుకొని ఆ పరమాణువు తన స్వస్తానికి వెళ్ళడమో లేదా తన యుగ యుగాల కర్మలను శుద్ది చేసుకొని పరిపక్వత పొంది తిరిగి తన పూర్వ  స్థితికి చేరవచ్చు. ఈ గమనములో త్రిగుణాల ఏక శక్తిగా మారటమో జరుగవచ్చు. ఆ కారణముగానే ఈ సృష్టి  మొత్తాన్ని  "కాలము" ఒక శక్తిగా నిర్వర్తించడం, సృష్టించిన ప్రతి జీవికి (వాహనానికి) నిర్ణీత సమయములో జరగవలసిన మార్పులు అంటే మన భాషలో Vehicle Services గా ఖచ్చిత మైన సమయములలో కర్మ సంబందిత మెలికతో జరగడం జ్యోతిష శాస్త్ర ఆకళింపు తో అర్ధం చేసుకోవచ్చు. అంటే ఇందులో మహా శక్తి (త్రిగుణాల ఏక శక్తి) లేదా మన ఊహల్లోని దేవుడి ప్రమేయం కూడా లేకుండా జరుగుతున్నదేమో అన్న సందేహం కూడా రావచ్చు. 

కాబట్టి ఏతావాతా మనం పరిహారాలు అన్నవి తిరిగి మన కొచ్చే అడ్డంకులే అన్న సత్యాన్ని గ్రహిస్తే ఈ పరిహారాల జోలికి వెళ్లకుండా జీవితాన్ని నాది కాదు అన్న జ్ణానముతో మరొకరి కోసం అన్న సత్యం తో పూర్తి చేయగలిగితే మోక్షం అని చెప్పే జన్మ లేని స్థితికి చేరవచ్చు.. 
ఈ సత్యాలను తెలుసుకునే మార్గములో ఈ  జ్యోతిష శాస్త్ర వివరాలను సూక్ష్మముగా తెలియ చేసే సంకల్పము ఈ బ్లాగ్ ఉద్దేశము. ఆధారిస్తారనే ఆశతో మీ "ఆనందోబ్రహ్మ" అని చెప్పు కునే మీ యల్లాప్రగడ ప్రసాద్ ..

గతములో పూర్వీకులు చేసిన పరిహారాల వలనే ఈ సంక్రమిత వ్యాదులు వస్తున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిహారాల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. మన తరములో ఈ కరోనా నే చూసి ఇంత భయపడుతున్నాము. రాబోయే రోజుల్లో అంటే వారసులు అనుభవించే రోజుల్లో ఇంతకంటే భయంకరమైనవి వస్తాయని చెప్పడములో ఎటువంటి అతిశయోక్తి ఉండదేమో ...   

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

గ్రహ కలయక లేదా గ్రహ యోగ

 నాభాస యోగము:  1 సంఖ్యా యోగము: ఈ యోగము చూడాలి అనుకుంటే జాతక చక్రములో నవ గ్రహాల బదులు సప్త గ్రహములు మాత్రమే గమనించాలి. అంటే ఛాయ గ్రహములు అయి...