"అతి సర్వత్రా వర్జయేత్" అన్నింటికీ, అందరికీ వర్తించే అద్భుత సూక్తి.
మోక్షం/ముక్తి ప్రతి మనిషి యొక్క ఆశయం... కానీ మరణించకూడదు... ఎలా వీలవుతుంది. బహుశా వారి ఊహాల్లో V మధుసూదన్ రావు గారి సినిమా భక్త తుకారాం లో లాగా పైనుంచి గరుడ వాహనం వచ్చి తీసుకు వెళుతుందనుకుంటున్నారేమో! అంటే అహంకారం కొద్ది నా కంటే భక్తుడు లేదు అన్నది వారి వితండమేమో. ఇది కలియుగములో ససేమిరా కుదరదు కదా... ఎందుకంటే ధర్మము ఒంటి కాలి నడక. శుక్రుని రాక్షస ధర్మమే ఎక్కడ చూసినా ...
సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఈ విషయంగా ఒకరి ప్రశ్నకు సమాధానం ఇస్తూ మోక్షం/ముక్తి అన్నది ఎవరికి రాదు... నువ్వు సృష్టించిన దేవుడు ముఖ్యమా! ముక్తి ముఖ్యమా... అంటే ఎదురు చూస్తున్నా ముక్తి తో దేవుడ్ని కూడా దూరం పెట్టాలనే యోచనతో అడుగుతున్నావా ఈ మోక్షాన్ని... అని ఎదురు ప్రశ్న సద్గురు నుంచి .... బోలెడన్నీ వీడియోలు మీరు అర్ధం చేసుకోవటానికి .... చూడండి మోక్షం మీద అపోహలు వీడండి... తోటి మానవులకు సహాయం చేయటం ద్వారా మీ జీవితాన్ని పవిత్రం చేసుకోండీ.
మోక్ష అంటే అన్నీ బంధాల నుండి విడుదలే కదా! అర్ధం.... మమకారం వాదులుకోలేమ్... మన జాతక చక్రములో మనకు ఎదురుగా ఉండే కామ త్రికోణపు ఉచ్చు నుండి బయటపడలేము.... లగ్న త్రికోణమునకు బలాన్ని ఇచ్చే కర్మలను ఆచరిస్తే కదా సప్తమ బావ త్రికోణం నీరసపడేది... శ్రీ రాముడి చరిత్ర తీసుకున్న పట్టాభిషేకం తర్వతా అడివికి పోయిన సీత గురించి భాధ పడటం కానీ వెతికి తీసుకురమ్మని హనుమంతుణ్ణి పంపటం కానీ జరిగిందా! లవకుశులు పుట్టి పెరిగి యాగాశ్వామును బందిస్తే కదా... పిల్లలు బతికి ఉన్నారు అన్న సంగతి బయటపడింది. అదే ఈ కాలములో బార్య ఒక్క రోజు కనపడక పోతేనే మనం వేసే చిందులు అంతా ఇంత కావు. మరి కామ త్రికోణపు ఆకర్షణ నుండి బయట పడగలమా! అది ఒక ఎత్తైతే ఆ తరువాత ఆధ్యాత్మిక చింతనలో శేష జీవితం ... ఈ కలియుగములో సాధ్యమేనా! చెప్పటానికి ఎన్నయినా చెప్పవచ్చు ... రియాలిటీ మాత్రం ఎవరికి వారే తెలుసుకోవాలి...
నిత్యం దైవారాధన, పూజలు, పునస్కారాలు చేయమని మీ (కర్మ) పదో స్థానము వివరించదు... కానీ మనం మాత్రం 24 గంటల్లో అధిక భాగం భగవంతుడికి కేటాయించటం జరుగుతోంది. ఒకరి కోసం ప్రార్ధనలు చేయటానికే అన్నట్లు మతాలు పుట్టుకొస్తున్నాయి... ఎవరికి వారు చేసుకోవలసిన పని ఇంకొకరి చేత చేయించటం... ఇవన్నీ చూస్తుంటే "నా కడుపు నింపుకుంటే మీ అందరి క్షుద్భాధ తీరినట్లే" అని చెప్పినట్లు లేదు... కాస్త సమయం చూసుకొని ఆలోచించండి. మనం చేస్తున్న తప్పులు బయటపడతాయి. ఆకలి కనపడే కళ్ళల్లో దాత కనపడితేనే ఆన్నదాన ఫలితం. అలాగే భగవంతుడికి చేసే పూజల్లో కూడా నీ భక్తి కనపడాలి కానీ సమస్యలు తీర్చమనే స్వార్ధం కాదు...
ఇంకా చెప్పాలిసింది చాలా ఉంది... ఇప్పటికీ ఇంతే...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.